ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి?
తెలుగు బైబిల్ క్విజ్స్ వారు నిర్వహిస్తున్న బైబిల్ క్విజ్స్ కొరకు రిజిస్టర్ చేసుకోగలరు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మీ యొక్క పేరు, మెయిల్ మొదలైన వివరాలు మాకు తెలియజేయబడుతాయి. మీ వివరాలు మాకు తెలిసినప్పుడే మేము మిమ్ములను సంప్రదించగలము. కావున ఈ యొక్క ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయగలరు.

Register Now
ప్రియమైన దేవుని సేవకులారా...!
ప్రభువు నామమున మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. తెలుగు బైబిల్ క్విజ్ బృందం వారు నిర్వహిస్తున్న ఈ బైబిల్ క్విజ్ కార్యక్రమం అనేకమందికి ఆధ్యాత్మికంగా దీవెనకరంగా మారిందన్న సాక్ష్యములను విని, మేము ప్రభువు నందు ఎంతో ఆనందిస్తున్నాము.
ఈ పరిచర్య ద్వారా అనేకమందికి ఆశీర్వాదములు పొందే అవకాశం కలుగుతోంది. దీనికి సహాయంగా నిలిచిన మీ అందరికి ధన్యవాదములతో పాటు, ఈ సేవలను అనుమతించిన ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమం దేవుని మహిమార్థముగా, ఆయన కీర్తి పెరగడానికి జరుగుతోంది.
ఈ క్విజ్లలోని ప్రశ్నలు:
- మన విశ్వాసాన్ని స్థిరపరచు విధంగా
- ఆత్మీయంగా ఎదగడానికి ఉపయుక్తంగా
- క్రైస్తవ జీవితం పట్ల అవగాహన పెరిగేలా
బైబిల్ లోని అనేక గొప్ప సత్యాలను ఈ క్విజ్‌ల ద్వారా మనం మరింత లోతుగా గ్రహించగలము.
నిత్య ధ్యానంలో మనం చదివిన వాక్యాలను గుర్తించుకోవడానికి, మదిలో నిలుపుకోవడానికి ఇవి ఎంతో సహాయపడతాయి.
ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని, బైబిల్ క్విజ్ కార్యక్రమానికి ఉచితంగా రిజిస్టర్ చేసుకొని పాల్గొనగలరు. ప్రభువు నుండి అధికమైన ఆత్మీయ దీవెనలు పొందండి! 🙏